అమానుషం.. కుక్కను స్కూటీకి కట్టి లాక్కెళ్లిన యువతులు
Two women tie dog to scooty drag it on road.ఈ మధ్యకాలంలో మూగజీవాల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు
By తోట వంశీ కుమార్ Published on
30 Jun 2021 3:02 AM GMT

ఈ మధ్యకాలంలో మూగజీవాల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. మనిషిలో మానవత్వం చచ్చిపోతుంది. పెంపుడు జంతువుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో కుక్క మూతికి టేప్‌తో చుట్టిన ఘటన మరువక ముందే పంజాబ్‌లోని పాటియాలాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ పెంపుడు కుక్కను ఇద్దరు యువతులు స్కూటీకి కట్టి లాక్కెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శునకాన్ని స్కూటీకి కట్టి లాగడంతో ఆ శునకం గాయాలపాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు యువతులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రోడ్డుపై ఉన్న పలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. గాయాలపాలైన కుక్కకు వైద్య సాయం అందించి కోలుకునేలా చేశారు. కాగా.. వారిని కొద్దిసేపటికే విడుదల చేశారు. ఈ కుక్కను ఎవరో పెంచుకునే వారని, అయితే..కొంతకాలం క్రితం దీనికి పిచ్చెక్కిందని ఆ యువతులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story