దారుణం.. శబ్దం చేస్తున్నాయని కుక్కపిల్లలపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు

మీరట్‌లోని కంకేర్‌ఖేడా ప్రాంతంలో పోలీసులు ఇద్దరు మహిళలు కుక్కపిల్లలపై తమ పైశాచికత్వాన్ని చూపించారు.

By Kalasani Durgapraveen  Published on  9 Nov 2024 10:15 AM IST
దారుణం.. శబ్దం చేస్తున్నాయని కుక్కపిల్లలపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు

మీరట్‌లోని కంకేర్‌ఖేడా ప్రాంతంలో పోలీసులు ఇద్దరు మహిళలు కుక్కపిల్లలపై తమ పైశాచికత్వాన్ని చూపించారు. ఐదు కుక్కపిల్లలపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఆ మహిళలపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

స్థానికంగా ఉంటున్న ఆ మహిళలు, కుక్కపిల్లలు చేస్తున్న శబ్దంతో విసుగు చెంది ఈ దారుణానికి ఒడిగట్టారని విచారణలో తేలింది. మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యానిమల్ కేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ అన్షుమాలి వశిష్ఠ్ అందించిన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జితేంద్ర కుమార్ తెలిపారు.

ఇద్దరు నిందితులు, శోభ, ఆర్తిలపై కంకేర్‌ఖేడా పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 325 కింద కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రోహతా రోడ్డులోని సంత్ నగర్ కాలనీలో నవంబర్ 5న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ వీధి కుక్క ఐదు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది,ఆ పిల్లలను నిందితులు టార్గెట్ చేసి, కుక్క పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దారుణంగా ప్రవర్తించిన మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.


Next Story