ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Two unidentified terrorists killed in Kulgam encounter.ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య జ‌మ్ముక‌శ్మీర్‌లోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2021 10:02 AM IST
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు గుర్తుతెలియ‌ని ఉగ్ర‌వాదులు హ‌తం అయ్యారు. ప్ర‌స్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. కుల్గాం జిల్లాలోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని స‌మాచారం అంద‌డంతో స్థానిక పోలీసులు, భ‌ధ్ర‌తా ద‌ళాలు గురువారం తెల్ల‌వారుజామున గాలింపు చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో సెర్చ్ ఆప‌రేష‌న్ బృందంపై ముష్క‌రులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు.

వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన బృందాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన కాల్పుల్లో ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని ఉగ్ర‌వాదులు మృతి చెందార‌ని జ‌మ్ముక‌శ్మీర్ పోలీసులు తెలిపారు. వీరు ఏ సంస్థ‌కు చెందిన వారు అన్న విష‌యం ఇంకా తెలియ‌రాలేద‌ని.. ఇంకా సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌ని పోలీసులు ట్వీట్ చేశారు.

Next Story