ఇద్దరు తీవ్ర వాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
Two terrorists killed in encounter with security forces in Srinagar.సెంట్రల్ కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా రంగ్రెత్
By M.S.R Published on 13 Dec 2021 4:05 PM ISTసెంట్రల్ కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా రంగ్రెత్ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులు, భద్రతా అధికారులు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు, భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా.. ఆ సమయంలో కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రదేశాన్ని భద్రతా బలగాలు మూసివేయడంతో.. ఎదురుకాల్పులకు దారితీసింది. గుర్తు తెలియని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. "#SrinagarEncounterUpdate: 02 unidentified #terrorists killed. Search going on. Further details shall follow," అంటూ పోలీసులు ట్వీట్ చేశారు.
"సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదికి లొంగిపోయేందుకు చాలా అవకాశాలు ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ, అతను నిరాకరించాడు. జాయింట్ సెర్చ్ పార్టీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌కు దారితీసింది, "అని పోలీసు ప్రతినిధి చెప్పారు.
#SrinagarEncounterUpdate: 02 unidentified #terrorists killed. Search going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/AaSI0CcMyK
— Kashmir Zone Police (@KashmirPolice) December 13, 2021
జమ్మూ కశ్మీర్‌లోని అవంతిపోరాలోని బరాగామ్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని ఉగ్రవాది అంతకు ముందు రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అవంతిపోరాలోని బరగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిర్దిష్ట సమాచారం అందుకున్న తరువాత, భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసు అధికారి తెలిపారు.