జ‌మ్మూకాశ్మీర్‌లో దారుణం.. ఇద్ద‌రు టీచర్ల‌ను చంపిన ఉగ్ర‌వాదులు

Two teachers shot dead inside a Srinagar school.జ‌మ్ముకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2021 8:01 AM GMT
జ‌మ్మూకాశ్మీర్‌లో దారుణం.. ఇద్ద‌రు టీచర్ల‌ను చంపిన ఉగ్ర‌వాదులు

జ‌మ్ముకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. శ్రీన‌గ‌ర్‌లోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప్రిన్సిపాల్‌తో పాటు ఓ టీచ‌ర్‌ను హ‌త‌మార్చారు. ఈరోజు(గురువారం) ఉద‌యం 11.15 నిమిషాల‌కు ఈద్గాం సంగం పాఠ‌శాల‌పై ఉగ్ర‌వాదులు దాడి చేశారు. ఇద్ద‌రు ఉపాధ్యాయుల‌ను పాయింట్ బ్లాక్‌లో కాల్చారు. దీంతో వారిద్ద‌రు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన టీచ‌ర్లను సిక్కు, కాశ్మీరీ పండిట్ వ‌ర్గానికి చెందిన స‌తీంద‌ర్ కౌర్‌, దీప‌క్ చాంద్ గా పోలీసులు గుర్తించారు. వెంట‌నే ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతాన్ని మూసివేసి.. ఉగ్ర‌వాదుల కోసం అన్వేష‌ణ మొద‌లుపెట్టిన‌ట్లు వెల్ల‌డించారు పోలీసులు.

నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాజా హత్యలను ఖండించారు. "శ్రీనగర్ నుంచి మళ్లీ షాకింగ్ న్యూస్ వస్తోంది. మరో లక్ష్యంగా హత్యలు, ఈసారి నగరంలోని ఈద్గా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ అమానవీయమైన ఉగ్రవాద చర్యకు ఖండించే పదాలు సరిపోవు కానీ నేను ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాను మరణించిన వ్యక్తి ప్రశాంతంగా ఉండండి "అని ఆయన ట్వీట్ చేశారు.

మంగ‌ళ‌వారం కూడా ఉగ్ర‌వాదులు ఓ క‌శ్మీరీ పండిట్‌ను హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే. శ్రీన‌గ‌ర్‌లోని ఇక్బాల్ పార్క్‌లో ఉన్న ఓ ఫార్మ‌సీ షాపు ఓన‌ర్ 70 ఏళ్ల మ‌ఖ‌న్ లాల్ బింద్రూను ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు. రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అత‌న్ని కాల్చారు. 1990 ద‌శ‌కంలో క‌శ్మీరీ పండిట్ బింద్రూ ఉగ్ర‌వాదం హెచ్చు స్థాయిలో ఉన్న స‌మ‌యంలోనూ ఫార్మ‌సీ న‌డిపారు. కాగా.. గత ఐదు రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారు.

Next Story
Share it