ఉత్తరప్రదేశ్‌లోని అమృత్‌సర్‌లో తృటిలో పెనుప్రమాదం తప్పింది. అమృత్‌సర్ నుంచి జయనగర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. లక్నో డివిజన్‌లోని చార్‌బాగ్ స్టేషన్ వద్ద రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కాగా.. రెండు భోగీలు మాత్రమే పట్టాలు తప్పాయని అధికారులు గుర్తించారు. రెండు భోగిల్లో కలిపి 155 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణీలకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ వన్ నుంచి బయలుదేరిన తరువాత రైలు పట్టాలు తప్పిందని, ఉత్తర రైల్వే ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. ఒక కోచ్‌లోని అన్నీ చక్రాలు పట్టాలు తప్పగా, మరొక కోచ్ ఒక చక్రం పట్టాలు తప్పిందని తెలిపారు.