Video: రివర్స్‌లో నడిచిన లోకల్ ట్రైన్.. ఎందుకంటే?

సోమవారం నవీ ముంబైలోని రైల్వే ట్రాక్‌పై పడిపోయిన 50 ఏళ్ల మహిళను కాపాడడం కోసం లోకల్ ట్రైన్ రివర్స్ లో నడిచింది.

By అంజి  Published on  8 July 2024 12:32 PM GMT
Train, Navi Mumbai, Belapur station,  Central Railway

రివర్స్‌లో నడిచిన లోకల్ ట్రైన్.. ఎందుకంటే? 

సోమవారం నవీ ముంబైలోని రైల్వే ట్రాక్‌పై పడిపోయిన 50 ఏళ్ల మహిళను కాపాడడం కోసం లోకల్ ట్రైన్ రివర్స్ లో నడిచింది. లోకల్ ట్రైన్ రివర్స్ లో వెళ్లడంతో ఆమె ప్రాణాలను కాపాడినట్లు అధికారి తెలిపారు. అయితే ఈ ఘటనలో ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. థానే వెళ్లేందుకు రైలు కోసం వేచి ఉన్న మహిళ ఉదయం 10 గంటల సమయంలో బేలాపూర్ స్టేషన్‌లో పట్టాలపైకి జారిపడింది.

రైలు ఆమెపై నుంచి వెళ్లడంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని రైల్వే అధికారి తెలిపారు. "బేలాపూర్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 3 పై ఉన్న పన్వెల్-థానే రైలును మహిళ ప్రయాణికురాలి ప్రాణాలను రక్షించడానికి రివర్స్ గేర్ లో పంపించారు. ఆపై ఆమెను సమీపంలోని MGM ఆసుపత్రికి తరలించారు" అని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను దగ్గరలోని ప్రయాణీకులు చిత్రీకరించారు. రైలు నెమ్మదిగా వెనుకకు కదులుతున్నప్పుడు మహిళ ట్రాక్‌పై ఉండడం రికార్డు అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story