ఒక్క ఇల్లు మినహా.. గ్రామం మొత్తం కొట్టుకుపోయింది
హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి విధ్వంసం సృష్టించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2024 12:39 PM ISTఒక్క ఇల్లు మినహా.. గ్రామం మొత్తం కొట్టుకుపోయింది
హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి విధ్వంసం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల మేఘాల విస్ఫోటనం కారణంగా వచ్చిన వరదలకు గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. సమేజ్ గ్రామానికి చెందిన ప్రజలు నిరాశ్రయులయ్యారు.
సమేజ్ గ్రామానికి చెందిన అనితా దేవి, ఆమె కుటుంబం నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కపడ్డారు. వారు బయటకు వచ్చి చూసేసరికి ఊరు మొత్తం కొట్టుకుపోయింది.. దీంతో ఊరిలోని భగవతి కాళీ మాత గుడికి పారిపోయి రాత్రంతా అక్కడే గడిపాంరు. ఈ విధ్వంసం నుండి మా ఇల్లు మాత్రమే బయటపడింది, కానీ మిగతావన్నీ నా కళ్ళ ముందే కొట్టుకుపోయాయని బాధను వ్యక్తం చేసిందామె.
డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం, హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మండి, సిమ్లా ప్రాంతాలలో ఊహించని విధంగా వచ్చిన వరదల కారణంగా కరిగిన విధ్వంసంలో శనివారం నాటికి మొత్తం 53 మంది కనిపించకుండా పోయారు. ఇక ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వరదల కారణంగా అరవైకి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయని, పలు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని డీడీఎంఏ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు. రాంపూర్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. భారీ వర్షం కారణంగా రాంపూర్, సమేజ్ ప్రాంతాలను కలిపే రహదారి దెబ్బతింది.