దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. అయితే.. ఇప్పటికి కూడా కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు సందేహిస్తున్నారు. దీంతో టీకాలపై అవగాహన కలిగిస్తూనే.. కొన్ని చోట్ల టీకా తీసుకున్న వారికి కొన్ని రకాల ప్రోత్సాహాకాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే చత్తీస్ గడ్‌లోని బీజాపూర్ మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమం చేపట్టింది.
టీకా తీసుకునే వారికి ఉచితంగా టమోటాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజాపూర్ మున్సిపాలిటీ పేర్కొన్నది. రైతుల నుంచి టమోటాలను సేకరించి టీకా తీసుకున్నవారికి పంచుతున్నామని బీజాపూర్ మున్సిపాలిటీ ప్రకటించింది. కాగా.. ఛత్తీస్‌గడ్‌లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్క రోజే 13,834 పాజిటివ్ కేసుము నమోదు కాగా.. 175 మంది ప్రాణాలు కోల్పోయిరు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా 6,083 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.