మీరు రేషన్‌ పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? అయితే ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి

Toll free for Nationwide Ration Card.రేషన్‌ పంపిణీలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే అందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.

By Medi Samrat  Published on  4 March 2021 5:52 PM GMT
Toll free for Nationwide Ration Card

ప్రభుత్వం నిరుపేదలకు జారీ చేసే రేషన్‌ కార్డు ద్వారా బియ్యం, గోధుమలు, పంచదార తదితర నిత్యావసరాలను అతి తక్కువ ధరకే ప్రభుత్వం అందజేస్తోంది. అయితే రేషన్‌ పంపిణీలో చాలా ఫిర్యాదు వస్తున్నాయి. రేషన్‌ డీలర్లు తమ కోటా రేషన్‌ ఇవ్వడంలో ఆశ్రద్ద చూపిస్తున్నారని కొన్ని ప్రాంతాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అయితే రేషన్‌ పంపిణీలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే అందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. రేషన్‌ పంపిణీలో ఇబ్బంది ఎదుర్కొన్నట్లయితే టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.


అయితే అవినీతిని తగ్గించడానికి, ఆహార ధాన్యాల పంపిణీ సక్రమంగా జరగడానికి కేంద్ర ప్రభుత్వం హెల్ఫ్‌లైన్‌ నెంబర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా అర్హులైన నిరుపేదలకు సరిగ్గా రేషన్‌ బియ్యం పంపిణీ జరగనట్లయితే ఈ నెంబర్లకు ఫోన్‌ చేస్తే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే NFSA వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ పోర్టల్‌లో ప్రతి రాష్ట్రానికి టోల్‌ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. అలాగే NFSA వెబ్‌ సైట్‌ https://nfsa.gov.in కు వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌ను కేటాయించారు.

రాష్ట్రాల వారీగా ఫిర్యాదు హెల్ప్‌లైన్ నంబర్లు:

తెలంగాణ – 1800-4250-0333

ఆంధ్రప్రదేశ్ – 1800-425-2977

మహారాష్ట్ర- 1800-22-4950

అరుణాచల్ ప్రదేశ్ – 03602244290

అస్సాం – 1800-345-3611

గోవా- 1800-233-0022

గుజరాత్- 1800-233-5500

బీహార్-1800 – 3456-194

ఛత్తీస్‌ఘడ్- 1800-233-3663

ఢిల్లీ – 1800-110-841

హర్యానా – 1800-180-2087

హిమాచల్ ప్రదేశ్ – 1800-180-8026

జార్ఖండ్ – 1800-345-6598, 1800-212-5512

కర్ణాటక- 1800-425-9339

కేరళ- 1800-425-1550

మధ్యప్రదేశ్- 181

మణిపూర్-1800-345-3821

మేఘాలయ – 1800-345-3670

మిజోరం – 1860-222-222-789, 1800-345-3891

ఉత్తర ప్రదేశ్- 1800-180-0150

నాగాలాండ్ – 1800-345-3704, 1800-345-3705

ఒడిశా – 1800-345-6724 / 6760

పంజాబ్ – 1800-3006- 1313

రాజస్థాన్ – 1800-180-6127

సిక్కిం – 1800-345-3236

తమిళనాడు – 1800-425-5901

త్రిపుర – 1800-345-3665

ఉత్తరాఖండ్ – 1800-180-2000, 1800-180-4188

పశ్చిమ బెంగాల్ – 1800-345-5505

జమ్మూ – 1800-180-7106

కాశ్మీర్ – 1800–180–7011

అండమాన్, నికోబార్ దీవులు – 1800–343–3197

చండీగర్- 1800–180–2068

దాద్రా నగర్ హవేలీ, డామన్ డియు – 1800-233-4004

లక్షద్వీప్ – 1800-425-3186

పుదుచ్చేరి – 1800-425-1082


Next Story
Share it