రైతులకు అలర్ట్‌.. పీఎం కిసాన్‌ ఈ-కేవైసీకి నేడే ఆఖరు

Today is the end of PM Kisan Sammannidhi e-KYC. దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం ప్రభుత్వం ప్రతిఏటా ప్రధానమంత్రి కిసాన్‌

By అంజి  Published on  10 Feb 2023 12:19 PM IST
రైతులకు అలర్ట్‌.. పీఎం కిసాన్‌ ఈ-కేవైసీకి నేడే ఆఖరు

దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం ప్రభుత్వం ప్రతిఏటా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటికే 12 విడతలుగా నిధులు విడుదలు చేసిన కేంద్రం.. త్వరలో 13వ విడత నిధులు చేసేందుకు సిద్ధమైంది. అర్హులైన రైతుల అకౌంట్లలో రూ.2 వేల చొప్పున జమ అవుతాయి. అయితే ఈ డబ్బులు ఈ - కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే జమ అవుతాయని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఫిబ్రవరి 10 నాటికి ఈ - కెవైసీ పూర్తి చేసిన వారికే నిధులు జమ అవనున్నాయి.

ఇప్పటికే ఈ - కెవైసీ పూర్తి చేసిన వారికి ఆధార్‌ నంబర్‌ అప్‌డేట్‌ అయినట్లు చూపిస్తుంది. ఈ - కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఓటీపీ ఆధారిత ఈ - కేవైసీనీ గానీ, దగ్గర్లోని మీసేవ వద్ద బయోమెట్రిక్‌ ఆధారిత ఈ - కేవైసీని గాని పూర్తి చేయాలి. ఆధార్‌తో బ్యాంక్‌ అకౌంట్‌ లింక్‌ అయిన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. కావునా.. ఆధార్‌తో బ్యాంక్‌ అకౌంట్ లింక్‌ అయ్యిందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంక్‌ అకౌంట్ లింక్‌ కాకపోయి ఉంటే ఏటీఎం కేంద్రానికి వెళ్లి సర్వీస్‌ ఆప్షన్‌లో ఆధార్‌ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోండి.

పోర్టల్‌లో ఈ-కేవైసీ ఎలా..?

ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/ని ఓపెన్‌ చేయండి. అందులో ఇ-కేవైసీ ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయాలి. మీ ఆధార్‌ కార్డు నంబర్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి. ఆ తర్వాత ఎంటర్‌ మొబైల్‌ నంబర్‌ అని కనిపిస్తుంది. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి గెట్‌ ఓటీపీని క్లిక్‌ చేయండి. ఇప్పుడు మళ్లీ ఆధార్‌ రిజిస్టర్డ్‌ ఓటీపీ అనే ఆప్షన్‌ వస్తుంది. మీ ఆధార్ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేస్తే ఈ-కేవైసీ పూర్తవుతుంది.

Next Story