నేడు జాతీయ బాలికల దినోత్సవం
Today is National Girl Child Day.దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానత
By తోట వంశీ కుమార్ Published on 24 Jan 2023 3:22 AM GMTదేశంలో బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానత గురించి అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వతంత్రం పొంది 75 సంవత్సరాలకు పైగా అయ్యింది. అయినప్పటికీ మన దేశంలో ఆడపిల్లలు సామాజిక వివక్ష, దోపిడీని ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఆరోగ్యం, పోషకాహారం, విద్య మరియు భద్రత విషయంలో కొందరు ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. జాతీయ బాలికా దినోత్సవం ఈ సమస్యలపై అవగాహన కల్పిస్తుంది. 2008లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకున్న చొరవతో జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
దేశ బాలికలకు అండగా ఉంటామని చెబుతూనే, అవకాశాలను అందించడం. అంతేకాకుండా ఆడపిల్లల హక్కుల గురించి అవగాహన కల్పించడంతో పాటు బాలిక విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించడం, వారి ఆరోగ్యం, పోషణపై అవగాహనం పెంచడం వంటివి దీని వెనుక ఉన్న లక్ష్యం. లింగ నిష్పత్తి గురించి అవగాహన కల్పించడంతో పాటు బ్రూణ హత్యలను నివారించడం. మహిళల విలువను చాటి చెప్పి ఆమెను గౌరవించేలా చేయడం దీని ఉద్దేశ్యం.
బాలికల పరిస్థితులను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఆడపిల్లలను రక్షించండి, బేటీ బచావో బేటీ పఢావో, సుకన్య సమృద్ధి యోజన, CBSE ఉడాన్ పథకం, బాలికలకు ఉచిత లేదా రాయితీతో కూడిన విద్య మరియు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి కార్యక్రమాలు బాలికలకు సాధికారత కోసం అద్భుతాలు చేస్తున్నాయి.