కలకలం రేపిన బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్.. రాజీనామా
TN BJP Gen Secy KT Raghavan quits.తమిళనాడు బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ కలకలం రేపుతున్నది.
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2021 9:58 AM ISTతమిళనాడు బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ కలకలం రేపుతున్నది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ తన ఇంటిలో అర్థనగ్నంగా కూర్చుని పార్టీ జిల్లా నాయకురాలితో అశ్లీలంగా మాట్లాడుతున్న వీడియో కాల్ మంగళవారం వైరల్ అయ్యింది. దీంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. ఈ వీడియో బయటకు రావడంతో కేటీ రాఘవన్ తన పదవికి రాజీనామా చేశారు. ఓ యూట్యూబ్ చానల్ నడుపుతున్న మదన్ అనే వ్యక్తి తన చానెల్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ స్టింగ్ వీడియోలో సదరు రాఘవన్- మహిళ మధ్య ఆడియో ఏమీ వినిపించడం లేదు.
అయితే.. సంజ్ఞల ద్వారా మహిళ ముందు "షో" చేస్తున్నట్లు వీడియో కనిపించింది. ఆ దృశ్యాన్ని చూడటంతో పాటు రాఘవన్ డిమాండ్ వినగానే ఆ మహిళ ఫోన్ పెట్టేశారని తెలిపారు. కాగా.. ఈ వీడియో బయటకు రావడంతో రాఘవన్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలతో అసభ్యంగా విడీయో కాల్ మాట్లాడిన రాఘవన్‌పై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. బయటే కాదు, బీజేపీ వంటి జాతీయ పార్టీలో కూడా మహిళలకు రక్షణ లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే.. దీనిపై రాఘవన్ స్పందించారు. తనను, పార్టీని అప్రతిష్ట పాలుజేసేందుకే సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వీడియోను విడుదల చేశారని కేటీ రాఘవన్ ఫేస్‌బుక్‌లో పోస్టులో ఆరోపించారు. తన గురించి ప్రజలకు తెలుసన్నారు. పార్టీ అధ్యక్షుడు అన్నామలైని కలిశాను. తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా కేటీ రాఘవన్ వ్యవహారంపై అన్నామలై విచారణ బృందాన్ని నియమించారు.