టైమ్స్ గ్రూపు చైర్‌పర్స‌న్‌ ఇందూ జైన్ క‌న్నుమూత‌

Times group chairman indu jain pass away. తాజాగా టైమ్స్ గ్రూప్ చైర్ ప‌ర్స‌న్ ఇందూ జైన్ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2021 7:02 AM GMT
indu jain

క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడాలేకుండా అంద‌రికి ఈ మ‌హ‌మ్మారి సోకుతోంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి సామాన్యుల‌తో పాటు వేలాది మంది ప్ర‌ముఖులు మృతి చెందారు. తాజాగా టైమ్స్ గ్రూప్ చైర్ ప‌ర్స‌న్ ఇందూ జైన్ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 84 ఏళ్లు. గత కొన్ని రోజుల క్రితం ఆమె కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం సాయ‌త్రం తుదిశ్వాస విడిచారు. ఇందూ జైన్ మృతి ప‌ట్ల రాజ‌కీయ‌వేత్త‌ల‌తో పాటు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. జీవితకాల ఆధ్యాత్మిక అన్వేషకులు, మార్గదర్శక పరోపకారిగా, కళల విశిష్ట పోషకులుగా విశేష కృషీ చేశారు. మహిళల హక్కుల కోసం నిరంతరాయంగా పోరాటం చేస్తున్నారు. సమాజ సేవ పట్ల నిర్విరామంగా శ్రమించారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 2016లో ఆమెను పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేసి సత్కరించింది.

1999లో ఆమె టైమ్స్ గ్రూపున‌కు చైర్మ‌న్ అయ్యారు. భిన్న‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆమె ఆక‌ట్టుకున్నారు. టైమ్స్ గ్రూపు అభివృద్ధికి ఆమె ఎంతో దోహ‌దం చేశారు. ద టైమ్స్ ఫౌండేష‌న్‌ను ఆమె 2000 సంవ‌త్స‌రంలో ఏర్పాటు చేశారు. తుఫాన్లు, భూకంపాలు, వ‌ర‌ద‌లు, మ‌హ‌మ్మారులు, ఇత‌ర సంక్షోభ స‌మ‌యాల్లో టైమ్స్ రిలీఫ్ ఫండ్‌తో ఆమె ఆదుకున్నారు. 2016లో ఆమెకు ప‌ద్మ విభూష‌న్ అంద‌జేశారు. త‌న అవ‌య‌వాలు దానం చేయాల‌న్న‌ది ఆమె జీవితాశ‌యం. కానీ కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో మ‌ర‌ణించడం వ‌ల్ల ఆమె కోరిక తీర‌లేదు.

ఇందూ జైన్ సమాజ సేవా కార్యక్రమాలు, భారతదేశం పురోగతి పట్ల అభిరుచి, సంస్కృతిపై ఆసక్తి ఉన్న వ్యక్తి అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇందూ జైన్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రధాని మోదీ తెలిపారు. అమె మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.


Next Story