బారాముల్లాలో ఎన్‌కౌంట‌ర్‌.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

Three Pakistani terrorists killed by security forces.జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2022 9:02 AM GMT
బారాముల్లాలో ఎన్‌కౌంట‌ర్‌.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య నేడు(బుధవారం) ఎద‌రుకాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టాయి. ఉగ్ర‌వాదు కాల్పుల్లో ఓ పోలీసు వీర మ‌ర‌ణం పొందారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. క్రీరి ప్రాంతంలోని న‌జీభ‌ట్ క్రాసింగ్ వ‌ద్ద ఉగ్ర‌వాదులు సంచ‌రిస్తున్నార‌నే స‌మాచారం అంద‌డంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుంది. ఉగ్ర‌వాదుల కోసం కార్డ‌న్ సెర్చ్‌ను ప్రారంభించింది. బ‌ల‌గాల‌ను చూసిన ఉగ్ర‌వాదులు వారిపై కాల్పుల‌కు పాల్ప‌డ్డారు.

అప్ర‌మ‌త్త‌మైన బ‌ల‌గాలు కూడా ప్ర‌తి కాల్పులు జ‌రిపింది. 'ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక జమ్మూ కాశ్మీర్ పోలీసు జవాను వీరమరణం పొందారు' అని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టాయ‌ని, కూంబింగ్‌, సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంద‌ని వివ‌రించారు.

ఇదిలా ఉంటే..శ్రీనగర్‌లోని చనాపోరా ప్రాంతంలో రెండు రోజుల క్రితం నిషేధిత ఉగ్రవాద సంస్థ LeT/TRFకి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it