సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం హౌరాలోని నల్పూర్ స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 22850) మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి.

By Kalasani Durgapraveen  Published on  9 Nov 2024 11:35 AM IST
సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం హౌరాలోని నల్పూర్ స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 22850) మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) ఓంప్రకాష్ చరణ్ మాట్లాడుతూ ఈ సంఘటనలో మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయని, అందులో ఒకటి B1 కోచ్ అని తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున పట్టాలు తప్పడంతో ప్రయాణికులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదని ఓం ప్రకాష్ చర్నా ధృవీకరించారు.

సంత్రాగచ్చి, ఖరగ్‌పూర్ నుండి యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, మెడికల్ రిలీఫ్ రైళ్లను వెంటనే సహాయం కోసం పంపినట్లు రైల్వే తెలిపింది. ప్రయాణికులను కోల్‌కతాకు తీసుకెళ్లేందుకు బస్సులను కూడా పంపించారు.

నల్పూర్ వద్ద పట్టాలు తప్పిన ఘటనకు సంబంధించి హెల్ప్ డెస్క్ నంబర్లు:

షాలిమార్:

62955 31471

45834 (రైల్వే)

సంత్రాగచ్చి:

98312 43655

89102 61621

ఖరగ్‌పూర్:

63764 (రైల్వే)

P/T. 032229-3764

హౌరా

75950 74714

Next Story