నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు పార్లమెంట్ లోనే బెదిరింపులు.. యాసిడ్ పోస్తారట..!

Threatened In Parliament Warned Of Acid Attack. నవనీత్ కౌర్.. ఒకప్పుడు టాలీవుడ్ లో నటిగా వెలుగు వెలిగారు. పార్లమెంట్ లో అమరావతి ఎంపీగా ఉన్నారు.

By Medi Samrat
Published on : 23 March 2021 2:46 PM IST

Navneeth Kaur

నవనీత్ కౌర్.. ఒకప్పుడు టాలీవుడ్ లో నటిగా వెలుగు వెలిగారు. ఇప్పుడు పార్లమెంట్ లో అమరావతి ఎంపీగా ఉన్నారు. ఆమె ఓ నాయకుడిపై సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ లోనే బెదిరించారని.. యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కు వ్యతిరేకంగా హౌజ్ లో మాట్లాడితే జైలులో వేస్తామని బెదిరించారని ఆమె అంటున్నారు. యాసిడ్ దాడి చేస్తామని ఫోన్ కాల్స్ లో బెదిరింపులు.. శివసేన లెటర్ హెడ్స్ మీద వార్నింగులు విషయాన్ని స్పీకర్ ఓం బిర్లాకు కూడా వివరించానన్నారు. ఇంతకూ ఆమెను బెదిరించిన పార్లమెంట్ సభ్యుడు ఎవరో తెలుసా.? అరవింద్ సావంత్ అట..!

మార్చి 22న పార్లమెంట్ సభ్యుడు అరవింద్ సావంత్ తనను బెదిరించాడని ఆమె పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని నవనీత్ కౌర్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ అయిన సచిన్ వాజే, మన్సుఖ్ హిరేన్ హత్యలపై మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు పార్లమెంటు ఆవరణలోనే తనను బెదిరించారని.. మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తానని, తనను కూడా జైలులో వేస్తానని హెచ్చరించారని అన్నారు. ఆయన బెదిరింపులు మొత్తం మహిళా లోకానికే అవమానమని, వీలైనంత త్వరగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ లేఖ ప్రతులను ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీకి కూడా పంపారు.

'నా ఒక్కదానికే కాదు. దేశంలోని మహిళలందర్నీ. అందుకే అతనిపై పోలీస్ యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నా' అని నవనీత్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నాకేం చేయాలో తెలియలేదు. వెంటనే వెనక్కు తిరిగి నా వెనుక కూర్చొన్న వ్యక్తిని అడిగా అతనేం అన్నాడో మీరు విన్నారా అని.. వాళ్లు కూడా అవుననే చెప్పారని లోక్ సభలో జరిగిన ఘటనను మీడియాకు వివరించారు. నువ్వు అందంగా ఉందని ఫీల్ అవుతున్న నీ ముఖంపై యాసిడ్ తో దాడి చేస్తామని, అప్పుడు ఎక్కడికి వెళ్లలేవని బెదిరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.


Next Story