'చేపలు తింటే ఐశ్వర్యరాయ్‌లా కళ్లు'.. బీజేపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on  22 Aug 2023 8:15 AM IST
eat fish, Maharashtra minister, Aishwarya Rai, Vijaykumar Gavit

'చేపలు తింటే ఐశ్వర్యరాయ్‌లా కళ్లు'.. బీజేపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ కళ్లు ఐశ్వర్యరాయ్‌ కళ్లులా అందంగా ఉండాలంటే రోజూ చేపలు తినాలని ప్రజలకు సూచించారు. రోజూ చేపలు తినే వారి చర్మం మృదువుగా ఉంటుందన్నారు. వారి కళ్లు మెరుస్తాయని చెప్పుకొచ్చారు. ఐశ్వర్యరాయ్‌ మంగళూరులో సముద్ర తీరానికి దగ్గరలో నివసించేవారని, ఆమె రోజూ చేపలు తినేవారు, మీ కళ్లు కూడా ఆమె కళ్లులా అందంగా మెరవాలంటే రోజూ చేపలు తినండి, మీకు కూడా ఆమె లాంటి కళ్లు వస్తాయి అని సూచించారు. నిత్యం చేపలను తినేవారికి నటి ఐశ్వర్యరాయ్ కళ్లు అంత అందంగా ఉంటాయని చెప్పడం వివాదాస్పదమైంది. మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో గవిత్ మరాఠీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "చేపలో కొన్ని నూనెలు ఉంటాయి, ఇది మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది" అని 68 ఏళ్ల మంత్రి విజయ్‌ కుమార్‌ గవిత్‌ అన్నారు. గవిత్‌ కుమార్తె హీనా గావిట్ బిజెపి లోక్‌సభ సభ్యురాలు. మంత్రి ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఎన్‌సిపి శాసనసభ్యుడు అమోల్ మిత్కారీ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే మాట్లాడుతూ.. తాను రోజూ చేపలు తింటానని, తన కళ్ళు అలా (ఐశ్వర్య రాయ్ లాగా) మారాలని, దీని గురించి ఏదైనా పరిశోధన ఉంటే తాను గవిత్ సాహిబ్‌ని అడుగుతానన్నారు.

Next Story