ఈ మద్య రైతులు వినూత్న ప్రయోగాలు చేస్తూ అందరి చూపు ఆకర్షిస్తున్నారు. ఆ మద్య పట్నాకు 400 కిలోమీటర్ల దూరంలోని పూర్ణియా జిల్లా చంఢీ పరిధిలోని లోహియానగర్ గ్రామానికి చెందిన రైతు శశిభూషణ్ సింగ్.. ఆకర్షణీయమైన నీలం, పసుపు, ఎరుపు రంగు కాలీఫ్లవర్లను పండిస్తు అందరికనీ ఆకర్షించారు. సాధారణంగా కాలీ ఫ్లవర్ తెల్లగా ఉంటుంది.. కానీ ఈయన మాత్రం నీలం, పసుపు, పర్ఫూల్ కవలర్ కాలీ ఫ్లవర్లు పండించారు. వినియోగదారులు సైతం వీటిని కొనేందుకు ఆసక్తి చూపించడం విశేషం.
మార్కెట్లో.. వీటికి మంచి డిమాండ్ ఉందని ఒక్కో కాలీఫ్లవర్ని రూ.50కి విక్రయిస్తున్నామని అమ్మకందారులు తెలిపారు. కంటి ఆరోగ్యానికి అతి ముఖ్యమైన పోషక పదార్ధాలలో ఒకటిగా నారింజ మరియు ఊదా కాలీఫ్లవర్లో ఆంటోసియానియాస్ మరియు కరొటెనాయిడ్స్ యొక్క విస్తారమైన కంటెంట్ పరిగణించబడుతుంది. ఆర్థోసియనిన్ దాని బలమైన శోథ నిరోధక మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కొన్ని తాపజనక పరిస్థితులను ఉపశమనం చేయగలదని కూడా పరిశోధన సూచిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా కల్బుర్గిలోని కొరల్లి గ్రామానికి చెందిన బసవరాజ్ పాటిల్ అనే యువ రైతు పసుపు పచ్చ రంగులో పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతూ శెహబాష్ అనిపించుకుంటున్నాడు.తాను పండించే పుచ్చకాయలు ఎరుపుగా లేకపోవడంతో తినేందుకు ప్రజలు విముఖత చూపారు. దాంతో తన ఉత్పత్తులను విక్రయించడానికి నగరంలోని స్థానిక మార్ట్, బిగ్ బజార్‌లతో కలిసి పనిచేశాడు. ప్రజలకు వీటిని తినడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ పాంప్లెట్స్ పంచిపెట్టారు. మొదట చాలా మంది ఆశ్చర్యపోయినా.. అది అలవాటు చేసుకున్న అక్కడి జనాలు ఈ పుచ్చపండు కొనేందుకు ఎంతో ఉత్సహం చూపిస్తున్నారని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.