తమిళనాడులో బైక్ మీద వెళుతున్న వ్యక్తిని ఆపిన పోలీసు.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే..!

This Biker In Tamil Nadu Was Stopped By A Cop.తమిళనాడులో పోలీసు ఓ బైకర్ ను ఆపాడు. కానీ ఆ పోలీసు బైకర్ ను ఏమి అడిగాడంటే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2021 2:40 PM IST
This Biker In Tamil Nadu Was Stopped By A Cop

పోలీసులు బైక్ ఆపుతున్నారంటే చాలు ఎందుకో ఎక్కడ లేని భయం వస్తుంది. తమిళనాడులో పోలీసు ఓ బైకర్ ను ఆపాడు. కానీ ఆ పోలీసు బైకర్ ను ఏమి అడిగాడంటే..!

మంచితనం అన్నది ఎక్కడో ఉండదు.. మన మనసులోనే ఉంటుంది. ఈ తమిళనాడు పోలీసు కూడా తన మంచితనాన్ని చూపించి అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు.. అలాగే ఆ బైకర్ కూడా తనకు చేతనైనంత సాయం చేసి చూపించాడు. తమిళనాడు లోని తెన్కాశీకి ఓ బైకర్ వెళుతూ ఉన్నాడు. అలా వెళ్తున్న ఆ బైకర్ ను పోలీసు ఆపాడు. ఆ బైకర్ ఒక యూట్యూబర్... ఆన్నీ అరుణ్ అనే యూట్యూబ్ పేజీలో ఈ వీడియోను అప్లోడ్ చేశారు. బైకర్ ను ఆపిన తమిళనాడు పోలీసు.. ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు.

కర్ణాటక నుండి వస్తున్నా అని బైకర్ తెలిపాడు. ఇంతలో పోలీసు అధికారి నీ ముందు ఒక తమిళనాడు బస్సు పోతూ ఉంది.. ఆ బస్సులో ముసలావిడ ఉంది. ఆ ముసలావిడ ఈ మందుల డబ్బాను జారవిడుచుకుంది అని చెప్పాడు. వెంటనే ఆ ముసలావిడకు మందుల డబ్బాను ఇవ్వమని పోలీసు చెప్పాడు. వెంటనే ఈ బైకర్ తన బైక్ లో వీలైనంత త్వరగా వెళ్లి.. తమిళనాడు బస్సును సైడ్ కు ఆపమని చెప్పి.. ఆ పెద్దావిడ మందుల డబ్బాను ఇచ్చేశాడు.

ఈ కాలంలో కూడా ఇంత మంచి తనం ఉందా అని వీడియోను చూసిన పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసు మంచి పని చేశాడని.. ఈ బైకర్ కూడా చాలా మంచోడు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఒకరికి సాయం చేయడం గొప్ప పని అని పలువురు ఈ వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు.


Next Story