సెప్టెంబర్ నెలలో ఈ రూల్స్ మారాయి.. మీరు గమనించారా?
కొత్త నెల ప్రారంభం అనగానే కొత్త కొత్త నియమాలు అమల్లోకి వస్తుంటాయి. అలాగే ఈ సెప్టెంబర్‌లోనూ కొన్ని మార్పులు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం
By అంజి Published on 2 Sept 2024 10:26 AM ISTసెప్టెంబర్ నెలలో ఈ రూల్స్ మారాయి.. మీరు గమనించారా?
కొత్త నెల ప్రారంభం అనగానే కొత్త కొత్త నియమాలు అమల్లోకి వస్తుంటాయి. అలాగే ఈ సెప్టెంబర్‌లోనూ కొన్ని మార్పులు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఫేక్ కాల్స్‌కి అడ్డుకట్ట: ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్, మెసేజెస్ విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కఠినమైన నిబంధనలు విధించిందిఇ. ఈ మేరకు పలు టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల సమస్యలకు పరిష్కారం లభించనుంది.
పెరగనున్న డీఏ: డియర్ అలవెన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్ ఈ నెలలో పెరగనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం.. ఈ సారి డీఏ 3 శాతం పెరగనుందని తెలుస్తోంది. జనవరి డీఏ పెంపు 4 శాతం ఉండటంతో.. మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది.
క్రెడిట్ కార్డు రూల్స్: క్రెడిట్ కార్డు యూజర్లకు సెప్టెంబర్ 1 నుంచి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రివార్డ్ పాయింట్లకు పరిమితి విధించింది. దీంతో కస్టమర్లు ప్రతి నెలా 2 వేల పాయింట్లు మాత్రమే పొందగలరు. ఇక ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కనీస మొత్తాన్ని తగ్గించింది. అలాగే చెల్లింపు గడువు కూడా 18 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది. ఇక రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులు కూడా ఇతర కార్డుల మాదిరిగానే రివార్డు పాయింట్స్ పొందవచ్చు..
ఫ్రీ ఆధార్ అప్‌డేట్: ఉచితంగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ నెల 14వ తేదీలోపు చేసుకోవాలి. ఎందుకంటే. గడువు ఆరోజుతోనే పూర్తవుతుంది. ఆ తర్వాత ఏదైనా సమాచారం అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువును చాలా సార్లు పెంచారు. అయితే ఈ సారి గడువు పెంచే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి.