స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్రపతి.. ఆర్మీ ఆస్ప‌త్రిలో చేరిక‌

The President of India hospitalized.భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ స్వ‌ల్ప అనారోగ్యానికి గుర‌య్యారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2021 2:29 PM IST
The President of India hospitalized

భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ స్వ‌ల్ప అనారోగ్యానికి గుర‌య్యారు. ఛాతిలో నొప్పి రావ‌డంతో ఆయ‌న్ను ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌ (ఆర్‌అండ్‌ఆర్‌)కు తీసుకువెళ్లారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తికి వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని ఆర్మీ హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు. కాగా.. ఆస్ప‌త్రిలో చేరకముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రథమ పౌరుడు అబ్దుల్ హమీద్ కు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.





Next Story