దొంగను రన్నింగ్ ట్రైన్‌ కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు

చోరికి ప్రయత్నించిన దొంగను ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు కిటికీకి వేలాడదీశారు.

By Srikanth Gundamalla  Published on  18 Jan 2024 7:39 AM IST
passengers,   thief,  train, bihar,

దొంగను రన్నింగ్ ట్రైన్‌ కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు

దొంగలు తమ చేతి వాటం చూపిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొందరు జేబులు కత్తిరిస్తుంటే.. ఇంకొందరు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తుంటారు. ఇంకా కొందరు దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య దొంగలు కొత్త దారిని ఎంచుకున్నారు. రైళ్లు కదులుతున్న సమయంలో కిటికీల దగ్గర ప్లాట్‌ఫాంపై నిలబడి చోరీలకు పాల్పడుతున్నారు. చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లు.. పర్సులు.. చైన్లను లాగేసుకుంటున్నారు. తాజాగా బీహార్‌లో ఓ దొంగ ఇదే తరహాలో చోరీకి ప్రయత్నించాడు. అయితే.. సకాలంలో స్పందించిన ప్రయాణికులు సదురు దొంగకు తగిన బుద్ధి చెప్పారు.

బీహార్‌లోని భాగల్‌పుర్‌ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రైలులో పర్సును దొంగతనం చేసేందుకు ఓ వ్యక్తం ప్రయత్నించాడు. రైలు పట్టాలపై నిల్చొని కిటికీల వద్ద పర్సు చూస్తోన్న ఓ వ్యక్తిపై కన్నేశాడు. దగ్గరకు రాగానే పరస్సును ట్రైన్‌ బయట నుంచే లాక్కునే ప్రయత్నం చేశాడు. అయితే.. ట్రైన్‌లో ఉన్న సదురు వ్యక్తి స్పందించి దొంగ చేతులు ట్రైన్‌లోకి పెట్టగానే గట్టిగా పట్టుకున్నాడు. దానికి మిగతా ప్రయాణికులు కూడా సాయం చేశారు. దాంతో.. సదురు దొంగ కిటికీకి వేలాడాడు. దొంగ రెండు చేతులు పట్టుకున్న ప్రయాణికులు కొంత దూరం వరకు కదులుతున్న రైలుకే అతన్ని వేలాడాదీశారు. ఆ తర్వాత రైలు ట్రాక్‌ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కందరు వ్యక్తులు వెంటనే పరిగెత్తుకు వచ్చి దొంగను కిందకు దించారు. తద్వారా మరోసారి దొంగతనం చేయాలంటే భయం కలిగేలా ఆ దొంగకు బుద్ధి చెప్పారు ప్రయాణికులు.

అయితే.. ఈ సంఘటనను ట్రైన్‌లో ఉన్న కొందరువీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ సంఘటనపై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. దొంగకు ప్రయాణికులు సరైన బుద్ధి చెప్పారనీ.. అతను మళ్లీ దొంగతనం చేయాలంటే భయడిపోతారని అంటున్నారు. ఇంకొందరు ట్రైన్లలో కూర్చొన్న సమయంలో ఇలాంటి సంఘనే తమకూ ఎదురైందని అనుభవాలను చెబుతున్నారు.

Next Story