ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం

ఎస్సీల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

By Srikanth Gundamalla  Published on  19 Jan 2024 7:24 AM GMT
central govt, committee,  SC classification,

ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం

ఎస్సీల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీ కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో పనిచేయనుంది. కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖ కార్యదర్శులను ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా చేర్చింది కేంద్ర ప్రభుత్వం. కాగా.. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ ఎంతో కాలంగా ఉన్న విషయం తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ హామీని ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి.. దాని ప్రకారమే ఇప్పుడు ముందడుగు వేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈనెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Next Story