చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి
The bus crashed into the pond in West Bengal.పశ్చిమబెంగాల్ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి
By తోట వంశీ కుమార్ Published on
23 Sep 2021 5:57 AM GMT

పశ్చిమబెంగాల్ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు వలస కూలీలు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ నుంచి యూపీలోని లఖ్‌నవూకు బస్సు వెలుతోంది. బుధవారం రాత్రి 10.45 సమయంలో పశ్చిమబెంగాల్‌లోని రాయిగంజ్ వద్ద 34వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహానాన్ని ఢీ కొట్టింది.
ఈ క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు వలసకూలీలు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Next Story