మ్యాగీ నూడుల్స్‌ తిని పదేళ్ల బాలుడు మృతి.. ఐదుగురికి అస్వస్థత

నూడుల్స్‌ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు.

By Srikanth Gundamalla  Published on  12 May 2024 3:22 PM IST
boy death,  instant noodles, uttar pradesh,

మ్యాగీ నూడుల్స్‌ తిని పదేళ్ల బాలుడు మృతి.. ఐదుగురికి అస్వస్థత 

ఉత్తర్‌ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. నూడుల్స్‌ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక ఈజీగా తయారు చేసుకునే మ్యాగీ నూడుల్స్‌ను చాలా మంది ఇళ్లలో ప్రిపేర్‌ చేసుకుని తింటున్నారు. యూపీలో ఈ మ్యాగీ నూడుల్స్‌ను తిన్న ఓ పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాదు.. మరో అదే కుటుంబానికి చెందిన మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌ తహసీల్‌ పరిధిలోని రాహుల్‌ నగర్‌లో సీమ అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమెకు డెహ్రాడూన్‌కి చెందిన సోను అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. సీమ తన కుమారులు రోహన్, వివేక్‌తో పాటు కూతురు సంధ్యతో కలిసి గురువారం తన తల్లి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం తమ ఇంట్లో ఉన్న మ్యాగీని రెడీ చేసి ఆ నూడుల్స్‌ను తిన్నారు. దాంతో పాటుగా కుటుంబ సభ్యులు అన్నం కూడా తిని నిద్ర పోయారు.

అయితే.. ఉన్నట్లుండి సీమ, ఆమె ముగ్గురు పిల్లలతో పాటు మరో ఇద్దరికి రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక ఆస్పత్రిలో చికిత్స తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో కుటుంబ సభ్యులు మొత్తం తిరిగి ఇంటికి వెళ్లారు. కొంత సమయం తర్వాత మరోసారి కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారు. కానీ ఈసారి ఆస్పత్రికి వెళ్లలేదు. సీమ పదేళ్ల కొడుకు రోహన్ కడుపులో నొప్పిగా ఉందంటూ చెప్పి నీళ్లు తాగి పడుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

కాసేపటికి ఎంతకీ బాలుడు కదలకపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. అతడు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఇక వరుసగా అస్వస్థతకు గురవుతున్న వారిని వైద్యులు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో చేర్పించారు. మరో బాలుడు వివేక్‌ను హయ్యర్‌ గ్రేడ్‌ హెల్త్‌ సెంటర్‌కు రిఫర్ చేశారు.

ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ఉత్తర్‌ ప్రదేశ్ వైద్యారోగ్యశాఖ దర్యాప్తును ప్రారంభించింది. ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్న ఐదుగురిని పురాన్‌పూర్‌ ఆరోగ్య కేంద్రం నుంచి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో చేర్పించామని డాక్టర్ రషీద్‌ చెప్పారు. అయితే.. బాధితులు ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌తో పాటుగా అన్నం కూడా తిన్నామని చెప్పినట్లు వైద్యుడు తెలిపారు. వివేక్‌ అనే బాలుడికి సీరియస్‌గా ఉండటంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం తరలించామని చెప్పారు. మిగతా వారి ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Next Story