తమిళనాడులో కల్తీసారా తాగి 25 మంది మృతి
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 1:56 AM GMTతమిళనాడులో కల్తీసారా తాగి 25 మంది మృతి
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుల్లకురిచిలో కల్తీ సారా తాగా ఏకంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. దాంతో.. స్థానిక అధికారులు వారికి ఆయా ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. కల్తీ సారా తాగడం వల్ల ముందుగా 10 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆ సంఖ్య 25 మందికి చేరింది. 25 మంది కల్తీసారా తాగి చనిపోవడంతో ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులు సారా కేంద్రల వద్ద మృతదేమాలతో ఆందోళనకు దిగారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. చివరకు పోలీసులు కలుగజేసుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పంపించేశారు. మృతుల కుటంబ సభ్యులు తమ వారిని కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ సంఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సీరియస్‌గా స్పందించారు. కల్తీ సారా మృతుల ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ బదిలీకి ఆదేశాలను కూడా జారీ చేశారు. ఒక కల్లకురిచి జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎంసీ ప్రశాంత్‌ను నియమిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కల్లకురిచి ఎస్పీ సమయ్ సింగ్ మీనాపైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సమయ్ సింగ్‌ను కూడా సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో కొత్త ఎస్పీగా రాజ్‌నాత్ చతుర్వేది బాధ్యతలు తీసుకున్నారు. ఈ సంఘటన పరిధిలోని పలువురు పోలీసు అధికారులను సైతం సస్పెన్షన్‌లో ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఘటనలో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు.