హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది విద్యాశాఖ. ఈ మేరకు బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటన జారీ చేసింది. మార్చి 18వ తేదీన టెన్త్ పరీక్షలు మొదలవుతాయని.. ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతాయని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపారు. అయితే.. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యామ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు.
టెన్త్ పరీక్షల్లో భాగంగా.. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21వ తేదీన ఇంగ్లిష్, 23వ తేదీన గణితం, 26న సైన్స్ మొదటి పేపర్, మార్చి 28న సైన్స్ రెండో పేపర్, మార్చి 30న సోషల్ పరీక్ష ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ ఒకటవ తేదీన ఒకేషనల్ కోర్సువారికి సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్ ఉండగా.. ఏప్రిల్ 2వ తేదీన రెండో పేపర్ పరీక్షలు జరుగుతాయని బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటనలో వెల్లడించింది.