ప్రేమ కోసం.. ప్రియుడి హెచ్ఐవీ ర‌క్తాన్ని ఎక్కించుకున్న ప్రియురాలు

Teenager injects boy friend HIV Positive blood to showcase her love. 'లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌' అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ప్రియుడిపై ఉన్న ప్రేమను ఈ యువతి వింతగా చాటుకుంది.

By అంజి  Published on  13 Aug 2022 3:00 PM IST
ప్రేమ కోసం.. ప్రియుడి హెచ్ఐవీ ర‌క్తాన్ని ఎక్కించుకున్న ప్రియురాలు

'లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌' అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ప్రియుడిపై ఉన్న ప్రేమను ఈ యువతి వింతగా చాటుకుంది. ప్రియుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తెలిసీ కూడా, నిజమైన ప్రేమను నిరూపించుకునేందుకు అతని రక్తాన్ని ప్రియురాలు ఎక్కించుకుంది. ఇప్పటికి అయినా తమను ప్రేమను అర్థం చేసుకోండి అంటూ తల్లిదండ్రులను వేడుకుంది. ఈ విచిత్రమైన ఘటన అసోంలోని సౌల్‌కుచి జిల్లాలో వెలుగు చూసింది. హజోలోని సత్డోలాకు చెందిన బాలికకు ఫేస్‌బుక్‌ ద్వారా 15 ఏళ్ల యువకుడు పరిచయం అయ్యాడు.

వారి పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. అమ్మాయి తన ఇంటిని విడిచిపెట్టి, అబ్బాయితో చాలాసార్లు పారిపోయింది. ఆమె పారిపోయిన ప్రతిసారీ తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులకు తన నిజమైన ప్రేమ గురించి ఎలాగైన తెలియజెప్పాలనుకుంది. ప్రియుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసిన‌ప్ప‌టికీ అత‌ని ర‌క్తాన్ని సిరంజి ద్వారా బ‌య‌ట‌కు తీసి.. ప్రియురాలు త‌న శ‌రీరంలోకి ఇంజెక్టు చేసుకుంది. ఇప్పుడైనా త‌మ ప్రేమ‌ను అర్థం చేసుకోండి, అంగీక‌రించండి అని ఆమె త‌ల్లిదండ్రుల‌ను వేడుకుంది.

Next Story