హృదయవిదారక ఘటన..కొడుకు చదువు కోసం తల్లి ప్రాణత్యాగం

ఓ తల్లి తన కొడుక్కి పెద్ద చదువులు అందించాలని, ఉన్నతస్థాయికి ఎదగాలని ప్రాణాన్నే త్యాగం చేసింది.

By Srikanth Gundamalla
Published on : 18 July 2023 2:30 PM IST

Tamilnadu, Woman Suicide, Son Higher Studies,

 హృదయవిదారక ఘటన..కొడుకు చదువు కోసం తల్లి ప్రాణత్యాగం

కన్న తల్లి ప్రేమకు మించింది ఈ లోకంలో మరోటి లేదు. సంతానంపై తల్లి పెట్టుకునే ప్రేమకు సాటి మరోటి ఉండదు. సంతానం కోసం తల్లి ఏదైనా చేస్తుంది. ఏదైనా ప్రమాదం ఎదురైతే ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుకుంటుంది. అలాంటిది కొడకుగానీ.. కూతురు గానీ ఏదైనా అవసరం వస్తే తన సాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఓ తల్లి తన కొడుక్కి పెద్ద చదువులు అందించాలని, ఉన్నతస్థాయికి ఎదగాలని ప్రాణాన్నే త్యాగం చేసింది. కాలేజ్‌ ఫీజు కట్టేందుకు డబ్బుల్లేక పోవడంతో.. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కోసం బలవన్మరణానికి పాల్పడింది. బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులో జరిగింది ఈ సంఘటన. మహిళ బస్సు కింద పడిన

A mother kills herself to meet son’s education expenses 😢

Being misled by someone, a mother, working as ‘safai karmachari’ at Collector’s office in Salem, kills herself by falling into a bus to get financial assistance from the Govt to pay son’s college fees of 45,000.

A…
pic.twitter.com/vzlcC6boWG

— Arvind Gunasekar (@arvindgunasekar) July 17, 2023
">వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.

సేలం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పాపాతి (45) అనే మహిళ పారిశుద్ధ్య కార్మికులరాలిగా పని చేస్తోంది. భర్తతో గొడవల కారణండా విడిపోయి ఒంటరిగానే ఉంటోంది. ఆమెనే పిల్లలను సాకుతోంది. పారిశుద్ధ్య కార్మికురాలు కావడంతో ఆమె జీతం తక్కువగా ఉంది. ఆమె కుమారుడు కాలేజీలో చదువుతున్నాడు. ఫీజులేమో వీరి సంపాదనకు మించి ఉంది. దాంతో.. కొడుకు కాలేజీ ఫీజు కట్టడం పాపాతికి భారం అయ్యింది. ఆర్థిక కష్టాలతో సతమతం అయ్యింది. కానీ కొడుకుని మాత్రం బాగా చదివించి.. ఉన్నతస్థాయిలో ఉంచాలని కలలు కన్నది. కానీ మరోవైపు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి. ఎలాగైనా కొడుకుని మంచి స్థానంలో ఉంచాలన్న ఆమె ఆలోచన.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకునేందుకు దారి తీసింది. బస్సు కింద పడి చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.45వేల నష్టపరిహారం ఇస్తోందని పాపాపతిని ఎవరో తప్పదోవ పట్టించినట్లు తెలుస్తోంది.

కొడుకు ప్రయోజకుడు అయితే చాలు.. తన ప్రాణం ముఖ్యం కాదనుకుంది ఆ తల్లి. రూ.45వేలు వస్తే కొడుకు చదువుకి ఉపయోగపడుతుందని చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. రోడ్డు దాటుతున్నట్లు నటిస్తూ వేగంగా వస్తోన్న బస్సు ముందుకు వెళ్లి. కంట్రోల్‌ కాకపోవడంతో బస్సు మహిళపు ఢీకొట్టింది. దాంతో.. ఆమె ఒక్కసారిగా ఎగిరి కిందపడిపోయింది. తీవ్ర గాయాలు అయ్యి పాపాతి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ హృదయ విదారకర సంఘటన గత నెలలో జరిగింది. కాగా.. బస్సు కింద పడి చనిపోయేందుకు పాపాతి రెండుసార్లు ప్రయత్నించిందని పోలీసలు తెలిపారు. మొదటిసారి బైక్‌ అడ్డుగా వచ్చి ఢీకొట్టిందని.. అయినా ఆగకుండా రెండోసారి బస్సు కింద పడి ప్రాణాలు తీసుకుందని తెలిపారు. ఇదంతా రోడ్డుపక్కన ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుని తల్లి కోరిక మేరకు.. ఆమె కుమారుడికి మంచి చదువు అందించాలని కోరుకుంటున్నారు.


Next Story