ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు వైద్య విద్యార్థులు మృతి

తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  22 Feb 2024 5:17 AM GMT
tamilnadu, car accident, four medical students, dead ,

ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు వైద్య విద్యార్థులు మృతి

తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన తిరువణ్ణామలై దగ్గర సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఒక్కసారిగా భాయందోళనకు గురిచేసింది. వైద్య విద్యార్థులు తిరువణ్ణామలై నుంచి తిండివనానికి కారులో వెళ్తుండగా జరిగింది.

వైద్య విద్యార్థులు కారును వేగంగా నడిపారు. ఇక అదే రోడ్డుపై కంగేయనూరు వద్ద అనోకుండా ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చి ఢీకొట్టారు. ఆ తర్వాత కారు అదుపుతప్పి పకనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. దాంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. కారులో ఉన్న నలుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కొద్ది క్షణాల్లోనే స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో.. వారు సంఘటనాస్థలానికి వచ్చారు. మృతుల వివరాలను సేకరించారు.

మృతిచెందిన వైద్య విద్యార్థులు విల్లుపురం జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. తిండివనం మెడికల్‌ కాలేజ్‌లో మెడిసిన్ చేస్తున్నట్లు పోలీసులు ధృవీకరించారు. ముందుగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. వైద్యులు వారిని పరిశీలించి అప్పటికే ప్రాణాలు కోల్పోయారని చెప్పడంతో .. స్పాట్‌లోనే చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేశామని చెప్పారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.. మరిన్ని విషయాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

Next Story