తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ధారపురం తాలూకాలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుంథతియార్ కులానికి చెందిన (షెడ్యూల్డ్ కులంగా వర్గీకరించబడిన) ఇద్దరు బాలికలను.. మరుగుదొడ్లు క్లీన్ చేయమని చెప్పింది. ప్రధానోపాధ్యాయురాలు మరుగుదొడ్లు శుభ్రం చేయమన్న ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత బుధవారం, ఏప్రిల్ 24న ఆమెను అధికారులు సస్పెండ్ చేశారు. అంబేద్కర్ పడిప్పగం (లైబ్రరీ) కేర్‌టేకర్‌లలో ఒకరు రికార్డ్ చేసిన వీడియోలో ఇద్దరు బాలికలు పాఠశాల మరుగుదొడ్లను శుభ్రపరుస్తున్నట్లు, ప్రధానోపాధ్యాయురాలు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ది హిందూ రిపోర్ట్ చేసింది.
ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న ప్రధానోపాధ్యాయురాలు ఇలమతి ఈశ్వరి, షెడ్యూల్డ్ కులంగా వర్గీకరించబడిన పరాయర్ కులానికి చెందినవారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బయటి వ్యక్తులు ఇద్దరు బాలికలను ఆరోపణ చేయడానికి "మానిప్యులేట్" చేశారని చెప్పారు. పాఠశాల విద్యా శాఖ ఆమెను సస్పెండ్ చేసినప్పటికీ, పాఠశాలలోని ఇతర సిబ్బంది ప్రధానోపాధ్యాయురాలి పక్షాన ఉన్నారని అధికారులు విచారణలో తెలుసుకున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆరోపణలు ప్రధానోపాధ్యాయురాలిని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమని వారు అంగీకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.