తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని గోబిచెట్టిపాళయంలో రాజా అనే 54 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడిని పాము కాటు వేస్తున్నట్లుగా విపరీతమైన పీడ కలలు వచ్చేవి. ఈ పీడ కలల కారణంగా అతడు చాలా ఆందోళన చెందాడు. ఈ కలల నుంచి విముక్తి పొందాలని బావించాడు. అందుకోసం ఓ జ్యోతిష్యుడిని కలిసి తన సమస్యను చెప్పుకున్నాడు. పామును పూజిస్తే చెడు కలల నుంచి విముక్తి కలుగుతుందని అతడికి జ్యోతిష్యుడు సలహా ఇచ్చాడు.
జ్యోతిష్యుడి సలహా మేరకు రాజా.. ఓ గుడిలో పామును పూజించాడు. ఆ పాము ముందు తన నాలుకను మూడు సార్లు చాపాడు. అంతే పాము అతడి నాలుకపై కాటు వేసింది. అది చూసిన ఆలయ పూజారి వెంటనే అక్కడకు వెళ్లాడు. కాటు వేసింది విషపూరిత రస్సెల్స్ వైపర్ కావడంతో పూజారీ అతడి నాలుకను కోసి ఈరోడ్ మణియన్ మెడికల్ సెంటర్‌కు తరలించాడు. అప్పటికే రాజా స్పృహతప్పి పడిపోయాడు.వెంటనే వైద్యులు అతడికి చికిత్స అందించారు. అతడి ప్రాణాన్ని కాపాడారు.
రోడ్ మణియన్ మెడికల్ సెంటర్ చీఫ్ ఫిజిషియన్ సెంథిల్ కుమారన్ మాట్లాడుతూ.. తెగిపోయిన అతడి నాలుకకు వైద్యులు చికిత్స అందించారు. పాము విషానికి విరుగుడు కూడా ఇచ్చారు. నాలుగు రోజుల ప్రయత్నం తరువాత అతడు ప్రాణాలతో బయటపడ్డాడు అని చెప్పారు. ఈ ఘటనలో రాజా తన నాలుకను కోల్పోవాల్సి వచ్చింది.