దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పాఠాలను కూడా ఆన్‌లైన్‌లోనే భోదిస్తున్నారు. ఇక పరీక్షలను నిర్వహించడం పెద్ద సవాల్‌గా మారింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే.. విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9,10,11 తరగతులకు విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 59 నుంచి 60 ఏండ్లకు పెంచుతున్నట్లు సీఎం పళని స్వామి ప్రకటించారు. తమిళనాడులో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ప్రభుత్వం ప్రజలపై కూడా వరాల జల్లు కురిపిస్తోంది.