దళితులు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం.. చెలరేగిన కుల ఘర్షణ

తమిళనాడులోని సేలం జిల్లాలోని దీవట్టిపట్టి గ్రామంలో ఆలయ ఉత్సవాల సందర్భంగా.. దళితులు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు కుల ఘర్షణ జరిగింది.

By అంజి  Published on  2 May 2024 2:30 PM GMT
Tamil Nadu, Caste clash, Salem Bengaluru highway,  Dalits, temple

దళితులు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం.. చెలరేగిన కుల ఘర్షణ

తమిళనాడులోని సేలం జిల్లాలోని దీవట్టిపట్టి గ్రామంలో ఆలయ ఉత్సవాల సందర్భంగా.. దళితులు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు మే 2, గురువారం నాడు సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై కుల ఘర్షణ జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. అరుంథతియార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు (షెడ్యూల్డ్ కులంగా వర్గీకరించబడ్డారు) కొనసాగుతున్న పూజ సమయంలో వారు ఆలోయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే నాయకర్, ఉడయార్, గౌండర్ కులాలతో సహా ఆధిపత్య సంఘాలు వారి ప్రవేశాన్ని నిరాకరించాయి. ఈ క్రమంలో ఇరు సంఘాల మధ్య వాగ్వాదం జరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది.

ప్రజలు జాతీయ రహదారిపై దుకాణాలు, వాహనాలకు నిప్పు పెట్టారని, ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారని, పరిస్థితిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులు తెలిపారు. పోలీసులు లాఠీచార్జి చేసి 20 మందిని అరెస్టు చేశారు. ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ నగల దుకాణంలో మంటలను ఆర్పడం, ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం , వాదించుకోవడం వంటి దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వెలువడ్డాయి. సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చి మంటలను ఆర్పివేశారని పోలీసులు మీడియాకు తెలిపారు.

Next Story