'ఆంటీ' అంటూ మమతా బెనర్జీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు
Suvendu Adhikari says Mamata Banerjee Aunty.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై , బీజేపీ నేత సువేందు అధికారి 66 ఏళ్ల ఆంటీ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
By తోట వంశీ కుమార్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై , బీజేపీ నేత సువేందు అధికారి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని 66 ఏళ్ల ఆంటీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఇటీవల మమతా విమర్శల నేపథ్యంలో సువేందు కౌంటర్ ఎటాక్ చేశారు.
దీదీ ఈ వయస్సులో, నోటిని అదుపులో పెట్టుకోవాలని, భాషను మార్చుకోవాలంటూ హితవు పలికారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు తప్పదని హెచ్చరించారు. ఒక ముఖ్యమంత్రిగా ఆమె తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, ప్రధాని మోదీపై ఆమె అభ్యంతరకర రీతిలో భాషను వాడుతున్నారని ఆరోపించారు. ఈ సందర‍్బంగా బెంగాల్ సీఎంను ఆంటీ అంటూ ఆయన సంబోధించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మమతా మీడియాతో మాట్లాడారని మండిపడ్డారు. మే 2వ తేదీన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, ఆ తర్వాత కూడా కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉండాలని సువేందు వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీపడుతున్న నందిగ్రామ్ నియోజకవర్గానికి కూడా ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక నందనాయక్ పబ్లిక్ స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో సువేందు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చి ఆయన ఓటు వేశారు. తనపై పోటీ చేస్తున్న దీదీకి ఓటమి తప్పదని సువేందు అన్నారు. ఈ ప్రాంత ప్రజలతో తనది దశాబ్దాల అనుబంధమని... ప్రతి వ్యక్తితో తనకు వ్యక్తిగత పరిచయం ఉందని చెప్పారు. తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బూత్ లలో ఏజెంట్లను నియమించుకోవడంలో కూడా టీఎంసీ విఫలమయిందని, దీదీ ఓటమి తప్పదని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు.