బాబ్రీ మసీదు తరహా మసీదుకు పునాది రాయి.. 30 లక్షలతో భోజనాలు

బెంగాల్‌లోని మతపరంగా సున్నితమైన ముర్షిదాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్యే ...

By -  అంజి
Published on : 7 Dec 2025 11:43 AM IST

Foundation, Babri masjid, West Bengal , Babri mosque

బాబ్రీ మసీదు తరహా మసీదుకు పునాది రాయి.. 30 లక్షలతో భోజనాలు

బెంగాల్‌లోని మతపరంగా సున్నితమైన ముర్షిదాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ గట్టి భద్రత మధ్య బాబ్రీ మసీదు తరహా మసీదుకు పునాది రాయి వేశారు. డిసెంబర్ 6, 1992న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం రోజునే ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం ఖురాన్ పారాయణం జరిగింది, ఆ తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరిగింది, దీనికి సౌదీ అరేబియాకు చెందిన ఇద్దరు మతాధికారులు సహా వేలాది మంది హాజరైనట్లు కబీర్ పేర్కొన్నాడు. వేదిక వద్ద 'నారా-ఎ-తక్బీర్', 'అల్లాహు అక్బర్' నినాదాలు చేశారు.

67% ముస్లిం జనాభా ఉన్న ముర్షిదాబాద్ లో కొన్ని నెలల క్రితం, ఏప్రిల్‌లో, వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఐదుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. శనివారం, నిర్వాహకులు రోడ్డు అడ్డంకులను నివారించడానికి, జాతీయ రహదారి (NH-12) ను కొనసాగించడానికి దాదాపు 3,000 మంది వాలంటీర్లను నియమించారు. సుమారు 40,000 మంది అతిథులకు, 20,000 మంది నివాసితులకు షాహి బిర్యానీని తయారు చేయడానికి ఏడు క్యాటరింగ్ ఏజెన్సీలకు ఒప్పందం ఇచ్చారు. సస్పెండ్ చేయబడిన TMC ఎమ్మెల్యే సన్నిహితుడు PTI తో మాట్లాడుతూ ఈ ఈవెంట్ కు ఆహార ఖర్చులు మాత్రమే రూ. 30 లక్షలు అని చెప్పారు. మొత్తం బడ్జెట్ రూ. 70 లక్షలకు పైగా ఉందని స్పష్టం చేశారు.

Next Story