జమ్ముకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ల కలకలం
Suspected drone spotted at two locations in Samba.జమ్ముకశ్మీర్ లో మళ్ళీ డ్రోన్లు కలకలం సృష్టించాయి
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2021 6:35 AM GMTజమ్ముకశ్మీర్ లో మళ్ళీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. డోమానా, సాంబా జిల్లాలో శనివారం రాత్రి డ్రోన్లు కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్నిగంటల వ్యవధిలో మూడు సార్లు కనిపించినట్లు వారు తెలిపారు. మొదట సాంబా జిల్లాలో గత రాత్రి 8 నుంచి 9 గంటల ప్రాంతంలో తక్కువ వెలుతురులో ఎగురుతున్న రెండు డ్రోన్లు వంటివి కనిపించాయని.. వాటిని తాను వీడియో తీశానని అక్కడి స్థానికుడు ఒకరు చెప్పాడు. ఆ తరువాత డోమానా జిల్లాలో రాత్రి 9 గంటల 50 నిముషాల ప్రాంతంలో తాను కూడా ఈ విధమైన వస్తువును చూసి తన మొబైల్ లో చిత్రీకరించానని.. అయితే.. మూడు నిముషాలకే ఆ వస్తువు కంపించకుండా పోయిందని మరొకరు చెప్పారు.
డ్రోన్లు కనిపించినట్లు స్థానికులు భద్రతా దళాలకు తెలియజేయడంతో వెంటనే సెక్యూరిటీ అధికారులు డ్రోన్లు కనిపించినట్లు చెబుతున్న ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇవి డ్రోన్లు అయి ఉండవచ్చునని చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిజానికి జమ్మూ సహా శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో ఎగిరే వస్తువులను ప్రభుత్వం నిషేధించింది. జమ్మూ లోని ఎయిర్ బేస్ వద్ద డ్రోన్లను కనిపెట్టడానికి తగిన వ్యవస్థలు ఉన్నా అవి ఈ తాజా వస్తువులను కనిపెట్టలేకపోయాయి. ఇక్కడ జామర్లు, యాంటీ డ్రోన్ సిస్టం లను ప్రభుత్వం గత నెల మొదటివారంలోనే ఏర్పాటు చేసింది.