భార్య తెచ్చే కట్నకానుకలపై భర్తకు హక్కు ఉండదు: సుప్రీంకోర్టు

వివాహ కట్నకానుకలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

By Srikanth Gundamalla  Published on  26 April 2024 10:38 AM GMT
supreme court, delhi, dowry,

భార్య తెచ్చే కట్నకానుకలపై భర్తకు హక్కు ఉండదు: సుప్రీంకోర్టు 

వివాహం జరుగుతున్న సందర్భంగా వధువు తల్లిదండ్రులు ఆమెకు బంగారం, డబ్బులు, ఇతర సామాన్లు కట్నకానుకల కింద సంతోషంగా అందిస్తారు. అయితే.. ఈ కట్నకానుకలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మహిళలకు తన పుట్టింటి వారు ఇచ్చిన డబ్బు, బంగారం ఆమెకు మాత్రమే చెందుతాయని స్పష్టం చేసింది. వాటిని తీసుకునే హక్కు భర్తకు గానీ.. అత్తింటివారికి గానీ ఉండదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.

అయితే.. ఆపద వచ్చిన సందర్భాల్లో భార్య పుట్టింటి నుంచి తీసుకొచ్చిన డబ్బులు, బంగారాన్ని కుదువ పెట్టినా.. లేక అమ్మేసినా తిరిగి మళ్లీ ఆమెకు ఇవ్వాల్సిన బాధ్యత భర్తపై ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. పెళ్లి తర్వాత ఓ మహిళ నగలు, డబ్బు తీసుకుని భర్త, అత్తింటివారు అప్పులు చెల్లించారు. వాటిని తిరిగి ఇప్పించాలని ఆ మహిళ కోర్టును ఆశ్రయించగా.. తిరిగి ఇచ్చేయాలంటే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది.

కేరళకు చెందిన ఓ మహిళ పెళ్లిన తొలి రాత్రే తన వద్ద ఉన్న 89 గ్రాముల బంగారం, తండ్రి ఇచ్చిన రూ.2లక్షల చెక్‌ను భర్త తీసేసుకున్నాడు. వాటిని భద్రపరుస్తానంటూ చెప్పి తీసుకున్నాడని మహిళ కోర్టుకు చెప్పింది. కానీ.. వాటిని అప్పులు తీర్చుకునేందుకు వాడుకోవడంతో నిలదీసింది. బంగారం, డబ్బును తిరిగి ఇప్పించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది సదురు మహిళ. ఈ కేసులో 2011లోనే మహిళకు అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కానీ.. అత్తింటి వారు కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. దాంతో.. సదురు మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది.

భార్య పుట్టింటి నుంచి తీసుకొచ్చిన కట్నకానుకలపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని తేల్చింది. కష్టకాలంలో వాడుకున్నా.. తిరిగి ఇచ్చే బాధ్యత భర్తపై ఉంటుందని చెప్పింది. కాగా.. ఈ కేసులో మహిళ నష్టపోయిన బంగారానికి బందులు రూ.25లక్షలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆ భర్తను ఆదేశించింది.

Next Story