ఎన్నికల ముందే కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారు?: సుప్రీంకోర్టు

సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

By Srikanth Gundamalla  Published on  30 April 2024 12:52 PM GMT
supreme court,  cm kejriwal, arrest, ed,

ఎన్నికల ముందే కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారు?: సుప్రీంకోర్టు

లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఇతర నేతలను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని ఇంకా విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. కాగా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక కామెంట్స్ చేసింది.

లోక్‌సభ ఎన్నికలకు కేవలం కొద్దిరోజుల ముందే సీఎం కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారనే దానిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనని అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విధంగా ఈడీని ప్రశ్నించింది. వ్యక్తి స్వేచ్ఛ అనేది చాలా కీలకమైనది అని.. దాన్ని ఏ దర్యాప్తు సంస్థ అయినా కూడా నిరాకరించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా అన్నారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సమయంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. విచారణ చేపట్టడం, ఆపై పలు ఫిర్యాదులు పునరావృతం కావడం మధ్య ఎందుకు విరామం ఉందనే వివరాలపైనా స్పందించాలని ఈడీ దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story