జనాభా పెరుగుదలపై పిటిషన్‌.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court notices central government to explain population growth. అధిక జనాభా సమస్యను సమర్థవంతంగా తగ్గించేందుకు నియమాలు, నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించేలా కేంద్రాన్ని

By అంజి  Published on  2 Sep 2022 8:07 AM GMT
జనాభా పెరుగుదలపై పిటిషన్‌.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

అధిక జనాభా సమస్యను సమర్థవంతంగా తగ్గించేందుకు నియమాలు, నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. జస్టిస్‌ కేఎమ్‌ జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌తో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి దండి స్వామి జీతేంద్రానంద సరస్వతి.. జనాభా నియంత్రణపై పిటిషన్‌ దాఖలు చేశారు.

దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతోందని, అయితే సహజ వనరులు పరిమితంగా ఉన్నాయని, అవి పెరుగుతున్న జనాభాకు సరిపోవని పిటిషన్‌లో పేర్కొన్నారు. జనాభా నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. జనాభా పెరుగుతుండటంతో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతున్నాయని జితేంద్రనంద్ సరస్వతి అన్నారు. ప్రస్తుతం భారత్​ జనాభా 139 కోట్లు అని, ఇది ప్రపంచ జనాభాలో 17.8 శాతం అని పిటిషన్​లో ప్రస్తావించారు.

దేశంలో వ్యవసాయ భూమి 2శాతమే ఉందని గుర్తు చేశారు. ప్రపంచంలో 4 శాతం మాత్రమే తానునీరు ఉందని అన్నారు. అమెరికాలో రోజుకు 10,000 మంది చిన్నారులు జన్మిస్తుండగా.. భారత్‌లో రోజుకు 70,000 మంది పుడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Next Story