హిజాబ్ నిషేధంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులు

Supreme Court gives different judgments on Hijab ban in educational institutions. కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును

By అంజి  Published on  13 Oct 2022 11:23 AM IST
హిజాబ్ నిషేధంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులు

కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం భిన్నమైన తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, హైకోర్టు తీర్పుపై వేసిన అప్పీళ్లను జస్టిస్ హేమంత్ గుప్తా కొట్టివేయగా, జస్టిస్ సుధాన్షు ధులియా వాటిని అనుమతించారు. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ హిజాబ్ బ్యాన్​పై అపీళ్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇది కేవలం ఛాయిస్ మాత్రమేనని, అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కాదని జస్టిస్ సుధాన్షు ధూలియా అన్నారు. దీంతో హిజాబ్​ వివాదంపై సుప్రీం కోర్టు ఎటూ తేల్చలేదు. "అభిప్రాయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి" అని జస్టిస్ గుప్తా తీర్పును ప్రకటించేటప్పుడు ప్రారంభంలో చెప్పారు. విభజన తీర్పును దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను సముచితమైన పెద్ద ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.

విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించకూడదనే వివాదంపై దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో 10 రోజుల పాటు వాదనలు సాగాయి. పిటిషన్ల తరఫున 21 మంది న్యాయవాదులు, ప్రతివాదుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ వాదించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇంతకుముందు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే గురువారం తీర్పును వెలువరించింది.

Next Story