మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే పలు పట్టణాలు, కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇదిలా ఉంటే.. పూణె జిల్లాలోని ఖేడ్ లో గల ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం భీమశంకరాలయం వరద నీటిలో మునిగిపోయింది. చరిత్రలోనే తొలిసారి ఆలయంలోని శివలింగం వరద నీటికారణంగా నీటమునిగిపోయింది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఆరవది. కొండ ప్రాంతంలో దిగువన ఉన్న ఈ ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
కొండ మీద నుంచి ఆలయం కింద వైపు ఉదృత స్థాయిలో బురద నీరు ప్రవహిస్తోంది. దీంతో గర్భాలయంలో ఉన్న శివలింగం పూర్తిగా నీట మునిగింది. భీమశంకరుడి చట్టు చేరుకున్న నీటిని తొలగించేందుకు ఆలయ పూజారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఏన్నడూ ఆలయంలోకి వరద నీరు వచ్చిన సందర్భంలేదని భక్తులు చెబుతున్నారు.