విద్యార్థులు తలలపై పుస్తకాల మూటలు.. ఇద్దరు ప్రధానోపాధ్యాయులను సస్పెండ్
Students forced to carry stacks of books on head from govt office to school, headmasters suspended. రెండు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తలపై పుస్తకాల మూటలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయం
By అంజి Published on 26 Sept 2022 7:32 AM ISTరెండు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తలపై పుస్తకాల మూటలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయం నుంచి పుస్తకాలు తీసుకెళ్లాలని ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను కోరినట్లు తెలిసింది. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపుట్ జిల్లాలో చోటుచేసుకుంది. హనుమాన్‌నగర్ మిడిల్ స్కూల్, నారాయణపూర్ మిడిల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని విద్యార్థులను తలపై పుస్తకాల మూటలు మోయాల్సిందిగా ఒత్తిడి చేశారు. విద్యార్థులు తమ తలపై సంచుల్లో పుస్తకాలను మోసుకెళ్లడం చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
విద్యార్థులు భారంతో కిలోమీటరుకు పైగా నడవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ద్వారా పుస్తకాలు పంపాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోరారని ఉపాధ్యాయుల్లో ఒకరు ఆరోపించారు. మరో ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయుడు వయసు పైబడ్డారని, అందుకే పుస్తకాలు తీసుకెళ్లాలని విద్యార్థులను కోరారని చెప్పారు. విద్యార్థులను ఎందుకు బలవంతంగా ఈ పనులు చేయించారు? రిక్షా లేదా బండి అద్దెకు తీసుకోవడానికి పాఠశాలకు తగినంత నిధులు లేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
వైరల్ వీడియోలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలకు దిగారు. రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేశారు.
విద్యార్థులను పుస్తకాలు తీసుకువెళ్లమని ఎందుకు బలవంతం చేశారు?
బీహార్‌లో విద్యాశాఖ 'చహక్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పాఠశాల పుస్తకాల కట్టలను BRC భవన్ మొహియుద్దీన్‌నగర్‌కు పంపింది. ఇక్కడి నుంచి బీఈవో ఆధ్వర్యంలో ఈ పుస్తకాలను బ్లాక్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలన్నారు. నారాయణపూర్ మిడిల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాలల విద్యార్థులను బీఆర్‌సీ భవన్ నుంచి పుస్తకాల కట్టలను పాఠశాలకు తీసుకురావాలని సూచించారు. ఈ క్రమంలోనే ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఈనెల 23న బీఈవోను వివరణ కోరుతూ లేఖ ఇచ్చారు. హనుమాన్‌నగర్ మిడిల్ స్కూల్ ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు సుచిత్ర రేఖా రాయ్, నారాయణపూర్ మిడిల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు సురేష్ పాశ్వాన్‌లను జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ (డిపిఓ) సస్పెండ్ చేశారు.