ర్యాగింగ్‌ కలకలం.. 'సార్‌' అని పిలవలేదని.. జూనియర్‌ భుజం విరగొట్టిన సీనియర్లు

Student brutally thrashed during ragging by seniors at Noida college. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగులోకి వచ్చింది. నోయిడాలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో జూ

By అంజి  Published on  16 Dec 2022 5:00 PM IST
ర్యాగింగ్‌ కలకలం.. సార్‌ అని పిలవలేదని.. జూనియర్‌ భుజం విరగొట్టిన సీనియర్లు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగులోకి వచ్చింది. నోయిడాలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో జూనియర్‌పై సీనియర్లు రెచ్చిపోయారు. 'సార్‌' అని పిలివలేదని జూనియర్‌ను విచక్షణారహితంగా కొట్టారు. దీంతో విద్యార్థి భుజం ఎముక విరిగింది. ఈ సంఘటన సెక్టార్ 58 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జేఎస్‌ఎస్‌ కళాశాలలో జరిగింది. 'సార్‌' అని పిలవలేదని, 'అసైన్‌మెంట్‌' పూర్తి చేయలేదని బాధిత విద్యార్థిని సీనియర్లు కొట్టినట్లు తెలిసింది. బాధితుడు గాయపడిన తరువాత ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించబడింది.

తృతీయ సంవత్సరం చదువుతున్న సీనియర్ విద్యార్థులు 'అసైన్‌మెంట్' చేయలేదని, 'సార్' అని పిలవలేదని జూనియర్‌లను ర్యాగింగ్ చేస్తున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. బాధిత విద్యార్థిని దారుణంగా కొట్టడంతో అతని భుజం ఎముక ఐదు చోట్ల విరిగిపోయింది. సెక్టార్ 58 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల నివేదిక ఆధారంగా కళాశాల యాజమాన్యం 'ర్యాగింగ్'కు పాల్పడిన నలుగురిని సస్పెండ్ చేసింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుని వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

తన హాస్టల్ గదిలో చదువుకుంటున్నప్పుడు బాధిత విద్యార్థిని గది నంబర్ 101కి రమ్మని సీనియర్లు చెప్పారు. అప్పటికే రూంలో సీనియర్లు మద్యం సేవిస్తున్నారు. జూనియర్‌ను అసైన్‌మెంట్‌ను పూర్తి చేయాలని చెప్పారు. దీంతో జూనియర్ తాను చేయనని చెప్పడంతో.. సీనియర్లు నోరు మెదపలేదు. విద్యార్థిపై దాడి చేయడం ప్రారంభించారు. బాధితుడు 'క్షమించండి భయ్యా' అని చెప్పినప్పుడు, వారు 'భయ్యా' అని కాదు 'సార్' అని చెప్పాలని పట్టుబట్టారని బాధితుడి చెప్పాడని పోలీసులు తెలిపారు.

Next Story