వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డ్‌.. అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే

States must implement one nation one ration scheme.ఒకే దేశం ఒకే రేష‌న్ కార్డు (వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డ్‌)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2021 10:56 AM GMT
వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డ్‌.. అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే

ఒకే దేశం ఒకే రేష‌న్ కార్డు (వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డ్‌) స్కీమ్‌ను అన్ని రాష్ట్రాలు అమ‌లు చేయాల్సిందేన‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జులై 31లోగా పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది. వలస కార్మికులు ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు పేర్లను నమోదు చేసుకునేలా ఓ పోర్టల్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకంతో వలస కార్మికులు తాము పనిచేసే చోటే రేషన్ ను తీసుకునే వీలు కలుగుతుందని చెప్పింది.

అంజలి భరద్వాజ్, హర్ష్ మందర్, జగ్ దీప్ ఛొకర్ లు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఇవాళ విచారణ చేసింది. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. వలస కార్మికులకు పొడి రేషన్ అందించాలని, మహమ్మారి కొనసాగే వరకు వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్‌లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అదే సమయంలో, అసంఘటిత రంగంలో కార్మికుల నమోదును నేషనల్ డేటా గ్రిడ్ పోర్టల్‌‌లో నమోదు చెయ్యాలని, ఈ పనిని జూలై 31 లోగా పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ సహకారాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

దేశంలో ఉన్న అన్ని చౌక‌ధ‌ర దుకాణాల నుంచి రేష‌న్ కార్డుతో.. బయోమెట్రిక్ విధానంలో రేష‌న్ తీసుకునే వెస‌లుబాటు క‌ల్పించిన‌ట్లు కోర్టుకు కేంద్రం విన్న‌వించింది. 32 రాష్ట్రాల‌కు చెందిన నేష‌న‌ల్ ఫుడ్ సెక్యూర్టీ యాక్ట్‌లోని 69 కోట్ల మంది ల‌బ్ధిదారుల్ని వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్‌కార్డు ప‌రిధిలోకి తెచ్చిన‌ట్లు భాటి తెలిపారు.


Next Story
Share it