రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను భారత్‌లో అత్యవసర వినియోగానికి ఆమోదించాలంటూ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే.. దేశంలో రోజురోజుకు అధిక సంఖ్యలో కేసులు పెరుగుతుండటంతో పాటు.. వ్యాక్సిన్ల కొరత ఉండటం కూడా టీకా ఆమోదం పొందవచ్చునని తెలుస్తోంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. దేశంలో వినియోగానికి అనుమతి పొందిన మూడవ వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ వి నిలువనుంది.
ఇప్పటి వరకు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసి.. సీరం ఉత్పత్తి చేస్తోన్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ప్రస్తుతం దేశంలో వినియోగంలో ఉన్నాయి. దేశంలో స్పుత్నిక్-వి ను డా. రెడ్డీస్ ల్యాబ్ తయారు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దీని సామర్థ్యం 91.6 శాతంగా ఉంది. మూడవ దశలో ఉన్న సమయంలో.. టీకా అత్యవసర వినియోగం నిమిత్తం ఆమోదించాలని ఫిబ్రవరి 19న డా. రెడ్డీస్ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది.
దీనిపై నిపుణుల కమిటీ సమావేశమై.. ఏప్రిల్ 1న ఈ టీకా శరీరంపై రోగ నిరోధక స్పందన తీరుపై ఎలా ప్రభావితం చేస్తుందో, ప్రతికూల అంశాలకు సంబంధించిన నివేదిక సమర్పించాలని కోరింది. దీనిపై నివేదిక అందించగా.. పరిశీలించిన నిపుణుల కమిటీ.. డిసిజిఐ అనుమతికి సిఫార్సు చేసింది.