దసరాకు ఉళ్లకు వెళ్లే ప్రయాణీకులతో రైళ్లు, బస్సుల్లో రద్దీ నెలకొంది. పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లివచ్చే ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. వివిధ స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారులు ట్వీట్ చేశారు. ప్రత్యేక రైలు ఏ తేదీన నడుస్తాయి, రైలు నంబర్, ఏ స్టేషన్‌లో ఎన్ని గంటలకు బయలు దేరుతుంది వంటి వివరాలు అందులో ఉన్నాయి. రైళ్ల వివరాలు తెలుసుకుని రిజర్వేషన్ చేసుకుంటే రద్దీ బాధ తప్పుతుంది.