ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రైల్ వన్ యాప్ ద్వారా అన్ రిజర్వ్‌డ్ టికెట్లు కొనుగోలు చేస్తే 3 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 14 నుంచి జులై 14 వరకు అమల్లో ఉంటుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రైల్ వన్ యాప్ ద్వారా రిజర్వుడు, అన్ రిజర్వుడుతో పాటు ప్లాట్‌ఫాం టికెట్లు కూడా సులభంగా పొందవచ్చన్నారు.
ప్రస్తుతం రైల్‌వన్ యాప్‌లో ఆర్-వాలెట్ ద్వారా టికెట్ కొనుగోళ్లపై వస్తున్న క్యాష్‌బ్యాక్ యథాతథంగా కొనసాగుతుంది. రైలు టికెట్, ప్లాట్‌ఫామ్ టికెట్, ట్రైన్‌లైవ్ ట్రాకింగ్, జర్నీలో ఫుడ్ బుకింగ్ ఇవన్నీ ఒక్క చోట అందించే ఉద్దేశంతో భారతీయ రైల్వే 'రైల్‌వన్ యాప్'ను తీసుకొచ్చింది. కాగా రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల పెంపు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి కిలోమీటర్‌కు స్వల్పంగా (1 లేదా 2 పైసల) పెంపు ఉన్నా సబర్బన్ ప్రయాణికులు, సీజనల్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఐఆర్‌సిటీసీలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు. 'My Profile'లో ప్రయాణికుల పేర్లు, వయసు, ఆధార్ వివరాలను ముందే సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల బుకింగ్ టైమ్‌లో మళ్లీ టైప్ చేసే పని ఉండదు. కేవలం ఒక్క క్లిక్‌తో ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. టైమ్ ఆదా అవ్వడమే కాకుండా తత్కాల్ సీటు దొరికే ఛాన్స్ పెరుగుతుంది. గరిష్ఠంగా 12 యంది వివరాలను ఇందులో సేవ్ చేసుకోవచ్చు.