క‌రోనా ఎఫెక్ట్‌.. ప‌లు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

South Central Railway cancelled few trains due to Covid Situation.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోమారు విజృంభిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2022 7:23 AM GMT
క‌రోనా ఎఫెక్ట్‌.. ప‌లు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోమారు విజృంభిస్తోంది. దీంతో రోజువారి కొత్త కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌లు దాటింది. ప‌లు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా ఉద్దృతి దృష్ట్యా ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 21 నుంచి 24 వ‌ర‌కు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది. ఈ మేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.



తెలంగాణ‌లో నిన్న నాలుగు వేల‌కు పైగా కేసులు న‌మోదు కాగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌దివేల‌కు పైగా కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,85,66,027కి చేరింది. నిన్న 703 మంది మ‌ర‌ణించారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,88,396కి చేరింది. ఒక్క రోజులో 2,51,777 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 3,60,58,806కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 20,18,825 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Next Story